
విపరీతంగా పెరుగుతున్న ఫ్లూ కేసులు... కోవిడ్-19 లక్షణాల్లానే ఉన్నాయంటున్న వైద్య నిపుణులు...
New Delhi: భారతదేశం అంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
New Delhi: భారతదేశం అంతటా అధిక సంఖ్యలో జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా ఫ్లూ (ఇన్ ఫ్లూయెంజా) కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి. (ఇన్ ఫ్లూయెంజా) లక్షణాలు సాధారణంగా జ్వరంతో పాటు నిరంతర దగ్గును కలిగి ఉంటాయని పేర్కొంటున్న వైద్యులు.. ఇటీవలి కాలంలో చాలా మంది రోగులు దీర్ఘకాలిక లక్షణాల గురించి చెబుతున్నారని వెల్లడించారు.