కొణిదెల కొదమ సింహాలు నాటికను అడ్డుకున్న పోలీసులు, పల్నాడులో ఉద్రిక్తత (వీడియో)
దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు కొణిదెల కొదమ సింహాలు సాంఘిక నాటికను ప్రదర్శించారు. అయితే పోలీసులు దీనిని అడ్డుకోవడంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు కొణిదెల కొదమ సింహాలు సాంఘిక నాటికను ప్రదర్శించారు.
అయితే పోలీసులు దీనిని అడ్డుకోవడంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల వాహనాలపై జనం రాళ్లు రువ్వారు. దీంతో ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి.