జగన్ కు షాక్: భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతం
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎదురుండదని ఇంతకాలం భావిస్తూ వచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎదురుండదని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కానీ, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టేసరికి ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు పెల్లుబుకాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడు, బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో తన తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు. హోం మంత్రిగా కొనసాగుతూ వచ్చిన మేకతోటి సుచరిత విషయం చెప్పనే అవసరం లేదు. ఆమె ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ సమర్పించారు. తిరుగులేని నాయకుడిగా ప్రసిద్ధి పొందిన వైఎస్ జగన్ కు ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయమే. ఇదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ విషయంలో జగన్ బలహీనత కూడా బయటపడింది.