బాలయ్య వస్తేనే పెళ్లి... మూడేండ్లుగా పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్న యువకుడు..!

సినిమా హీరోల కోసం.. ఫ్యాన్స్ చేసే హాడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోల కోసం ప్రాణాలు వదిలిని వారు కూడా లేకపోలేదు. 

First Published Mar 10, 2023, 2:06 PM IST | Last Updated Mar 10, 2023, 2:06 PM IST

సినిమా హీరోల కోసం.. ఫ్యాన్స్ చేసే హాడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోల కోసం ప్రాణాలు వదిలిని వారు కూడా లేకపోలేదు. ఇక తమ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు  థియేటర్లకు వెళ్లి కాగితాలు చింపడం, చొక్కాలు చింపుకోవడం.. రచ్చ రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ విషయంలో అంతకు మించి అన్నట్టు గా ఉంటారు బాలయ్య ఫ్యాన్స్.  ఆయనపై అంతులేని అభిమానంతో... వారు చేసే పనులు ఒక్కోసారి చిత్రంగా అనిపిస్తుంటాయి. రీసెంట్ గా బాలయ్య అభిమాని చేసిన పనికి అంతా ఔరా అంటున్నారు. ఇంతకీ అంతలా అతను ఏం చేశాడంటే.. బాలకృష్ణ కోసం మూడేళ్ళుగా తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.