
It's Complicated Movie: సిద్ధు, రానా ప్రెస్ మీట్
'ఇట్స్ కంప్లికేటెడ్'.. రానా దగ్గుబాటి సమర్పణలో రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ చిత్రం. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికట్టి ప్రధాన పాత్రల్లో అలరించబోతున్నారు. ప్రేమ, హాస్యం, కన్‌ఫ్యూజన్‌తో నిండిన ఈ లవ్ స్టోరీ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు డైరెక్టర్ రవికాంత్, రానా, సిద్ధు.