గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : కూతురితో కలిసి మొక్కలు నాటిన బండ్ల గణేష్..

టీవీపై మూర్తి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నిర్మాత బండ్ల గణేష్ స్వీకరించారు.

First Published Jul 28, 2020, 10:58 AM IST | Last Updated Jul 28, 2020, 10:58 AM IST

టీవీపై మూర్తి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నిర్మాత బండ్ల గణేష్ స్వీకరించారు. కూతురు జననితో కలిసి మొక్క నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ఆక్సీజన్ అని వాటిని అందించే మొక్కలు నాటే వినూత్న ఆలోచనకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో శ్రీకారం చుట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నిర్మాత బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. తన మిత్రులైన దర్శకులు కృష్ణవంశీ, శ్రీనువైట్ల, పరశురాంలను ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు.