
Sabdham Movie: నా కొడుకు వల్ల భయపడ్డా: నాని
ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘శబ్దం’. ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ‘వైశాలి’ తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్‌లో రూపొందిన రెండో మూవీ ఇది. 7జీ ఫిల్మ్స్ సమర్పణలో శివ ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 28న థియేటర్లలో సినిమా విడుదల సందర్భంగా హైదరబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా నేచురల్ స్టార్ నాని హాజరై మాట్లాడారు. తన కొడుకు చేసిన శబ్దం వల్ల భయపడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. శబ్దం మూవీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకుననారు.