Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ కి కరోనా ఎఫెక్ట్ : మార్చి 21 వరకు సినిమా షూటింగ్స్, థియేటర్స్ బంద్..

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అనుసరిస్తూ సినిమా షూటింగ్స్, థియేటర్స్ మార్చి 21వరకు మూసివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రకటించాయి.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అనుసరిస్తూ సినిమా షూటింగ్స్, థియేటర్స్ మార్చి 21వరకు మూసివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రకటించాయి. మార్చి 21 తరువాత కూడా ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతిస్తామని అన్నారు. ఈ సమావేశంలో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ, సెక్రెటరీ జీవిత తదితరులు పాల్గొన్నారు.