చంద్రగ్రహణం మనకు కనిపిస్తుందా.. ఎక్కడ, ఏ సమయంలో...
జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చంద్రగ్రహణం కనువిందు చేయనుంది.
జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ముఖ్యంగా అమెరికాలో ఇది కనిపించనుంది. దాంతో పాటు ఐరోపాలోని అనేక దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో చంద్రగ్రహణం ప్రభావం కనిపించనుంది. భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు. ఇక చంద్రగ్రహణం వల్ల చంద్రుడి పరిమాణంలో మార్పు ఉండదు. జూలై 4న లాస్ ఏంజిల్స్ లో మూడు గంటలపాటు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో పాటే కేప్ టౌన్ లో చంద్రగ్రహణం జూలై 5న కనిపించనుంది. ఈ చంద్రగ్రహణాన్ని ఉపఛ్చాయ చంద్రగ్రహణం లేదా నీడ చంద్రగ్రహణం అని పిలుస్తారు.