
జగన్ కోసం మేమే వాలంటీర్లు అవుతాం: మేరుగ నాగార్జున
ఏపీలో దళారులు రాజ్యమేలుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మాటలు నిజం చేస్తున్నారన్నారు. జగన్ హయాంలో వ్యవసాయం పండగలా ఉంటే.. చంద్రబాబు పాలనలో రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న రైతుల కష్టాలను తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వస్తే భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కి పోలీసు భద్రత లేకుండా చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని.. జగన్ భద్రత కోసం తాము వాలంటీర్లుగా మారి భద్రత కల్పిస్తామని చెప్పారు.