userpic
user icon

లోటస్ పాండ్ కి మీ పేర్లు పెట్టుకోండి... ప్రభుత్వ ఆస్తులకు కాదు : జగన్ కి సోము వీర్రాజు సలహా..!

Naresh Kumar  | Published: May 1, 2023, 4:05 PM IST

ప్రభుత్వ ఆస్తులకు కాదు లోటస్ పాండుకు మీ పేర్లు పెట్టుకోండి అంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీసోమువీర్రాజు  ముఖ్యమంత్రి కి సలహా ఇచ్చారు. విశాఖ నగరంలో టూరిజం పాయింట్ గా ఉన్న సీతకొండకు వైఎస్ఆర్ అని నామకరణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిజెవైఎం ఉధ్యమం చేస్తుంటే  ఎందుకు ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని సోమువీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.   సీత కొండ పేరు మార్చడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కావాలంటే  లోటస్ పాండ్ కు పేరు పెట్టుకోండని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు   పార్టీ కార్యాలయం లో ఉన్న బిజెపి, బిజెవైఎం నేతలను  అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు .   అరెస్టులు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Read More

Video Top Stories

Must See