ఒక్కొక్కడికి చెప్పులతో సమాధానం చెబుతాం..: అసభ్య పోస్టులపై టిడిపి అనిత సీరియస్

విజయవాడ : మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిని చెప్పులతోనే సమాధానం చెబుతామంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు.

Share this Video

విజయవాడ : మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిని చెప్పులతోనే సమాధానం చెబుతామంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. ముఖ్యంగా టిడిపి మహిళా నేతలపై పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కడి చిట్టా తమ దగ్గర ఉందని... సీఎం జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వచ్చిన వారిని కాపాడలేడని హెచ్చరించారు. మహిళలపై అపభ్యకర కామెంట్స్ చేస్తున్న వైసిపి శ్రేణులను జగన్ కంట్రోల్ చేసుకోవాలని... లేదంటే మేమే వారిని కంట్రోల్ చేస్తామని అనిత హెచ్చరించారు. విజయవాడ దుర్గ గుడి వద్ద తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వంగలపూడి అనితతో పాటు మహిళలంతా కాళ్ల చెప్పులు చేతిలో పట్టుకుని చూపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిననాటి నుడి తమపై అసభ్య పోస్టులు పెడుతున్నారని... సజ్జల భార్గవరెడ్డి వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులై తర్వాత ఈ అసభ్య పోస్టింగులు మరింత పెరిగాయన్నారు. మీ తల్లులపైనా ఇలాగే కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా..? అంటూ అనిత సీరియస్ అయ్యారు. 

Related Video