ఈ తీర్పుతో హైకోర్టు జగన్ రెండు చెంపలూ వాయించింది.. అచ్చెన్నాయుడు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

First Published May 29, 2020, 2:22 PM IST | Last Updated May 29, 2020, 2:22 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీలో ఇంకా ప్రజాస్వామ్యం బతికేఉందన్న నమ్మకం కలిగింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ తప్పూ చేయలేదని మేము చెబుతూనే ఉన్నాం.. కరోనా ఉధృతి నేపథ్యంలో నిమ్మగడ్డ  ముందుచూపుతో ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాను జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల అధికారిని కులం పేరుతో దూషించారు.