Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ సురేష్ పై దాడి : ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోకపోతే ఎలా???

వైసీపీ నేత, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ని ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే. 

వైసీపీ నేత, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ని ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అధికారిక కార్యక్రమంలో భాగంగా నందిగామకు వెళ్లగా తన వాహనాన్ని కొందరు అకారణంగా అడ్డుకోవడమే కాదు దాడికి కూడా ప్రయత్నించినట్లు ఎంపీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఎంపీ వాహనాన్ని అడ్డుకున్న 20మందిపై కేసులు నమోదు చేసినట్లు నందిగామ డిఎస్పీ రమణ మూర్తి ప్రకటించారు.