
తమన్‌ది చాలా మంచి మనసు: నారా భువనేశ్వరి
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. తమన్‌ది చాలా మంచి మనసు అని భువనేశ్వరి కొనియాడారు. తలసేమియా బాధితుల కోసం మ్యూజికల్ అనగానే ఏమీ ఆలోచించకుండా ఒప్పుకొన్నాడని అభినందించారు.