భారీ వ్యయంతో ఏపీలో షూటింగ్ టౌన్... ప్రారంభించిన మాజీ మంత్రి నాని, చోటా కె.నాయుడు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో నిర్మింంచిన షూటింగ్ టౌన్ ఇండోర్, అవుట్ డోర్ స్టూడియోను ప్రముఖ కెమెరామెన్ ఛోటాకె నాయుడు, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ ప్రారంభించారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి వీలుగా అద్భుతమైన 40 రకాల సేట్లతో ఈ షూటింగ్ టౌన్ ఏర్పాటుచేసారు. ఫ్రీ వెడ్డింగ్, కిడ్స్ ఫోటోగ్రఫీ, కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిం మేకర్స్ కి ఈ షూటింగ్ టౌన్ చాలా ఉపయోగకరంగా వుంటుందన్నారు.లక్షల రూపాయల ఖర్చు పెట్టి భారీ సెట్టింగ్లతో ఈ పల్లెటూర్లో కొండల నడుమ షూటింగ్ టౌన్ ఏర్పాటుచేసిన నిర్వహకులను చోటాకె నాయుడు అభినందించారు. చాలా విశాలంగా ఊటీని తలపించే విధంగా చక్కగా తీర్చిదిద్దిన ఈ షూటింగ్ సిటీ తప్పకుండా సక్సెస్ అవుతుందన్నారు.