అదుపుతప్పి గ్యాస్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు.. పదిమందికి గాయాలు..

విశాఖపట్నం జిల్లా,  అగనంపూడి టోల్ గేట్ దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగింది.

| Updated : May 27 2020, 04:05 PM
Share this Video

విశాఖపట్నం జిల్లా,  అగనంపూడి టోల్ గేట్ దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగింది. టెక్కలి నుంచి విజయవాడ వెళ్తున్న AP30z 0174 నెంబర్ గల బస్సు అగనంపూడి దగ్గర్లో వచ్చేసరికి అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లారీ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారుగా పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. డ్రైవర్ కి కూడా దెబ్బలు తగిలేయి. ఒక ప్రయాణికుడికి కాలుఫ్యాక్చర్ అయ్యింది.. వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి, దెబ్బలు తగిలిన వారికి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుల నుంచి పోలీసు వారు  వివరాలు సేకరిస్తున్నారు. 

Related Video