రంగనాయకమ్మను సిఐడీ విచారించిన తీరు ఇదీ....

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ విష వాయువు లీకేజీ ఘటనపై ఫేస్‌ బుక్‌ లో పోస్టులు పెట్టిన గుంటూరు కు చెందిన రంగనాయకమ్మపై సీఐడీ విచారణ ముగిసింది. 

| Updated : May 21 2020, 05:39 PM
Share this Video

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ విష వాయువు లీకేజీ ఘటనపై ఫేస్‌ బుక్‌ లో పోస్టులు పెట్టిన గుంటూరు కు చెందిన రంగనాయకమ్మపై సీఐడీ విచారణ ముగిసింది. గుంటూరులోని సీఐడీ కార్యాలయం లో మహిళా పోలీసుల సమక్షం లో ఆమెను అధికారులు విచారించారు. విచారణ అనంతరం రంగనాయకమ్మ మీడియా తో మాట్లాడుతూ.. ‘‘నాతో పాటు మరో వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఆయన విచారణ సమయంలోనూ నన్ను హాజరు కావాలన్నారు. గతంలో నా ఫేస్‌ బుక్‌ పోస్టులపై కూడా అధికారులు అడిగారు. పత్రికలు, టీవీల్లో వచ్చిన దృశ్యాలు చూసిన తర్వాతే స్పందించి నట్లు చెప్పాను. విచారణ సమయ లో సీఐడీ అధికారులు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్ట లేదు’’ అని వివరించారు. మరో సారి విచారణ కు హాజరు కావాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు రంగనాయకమ్మకు సూచించారు.

Read More

Related Video