Asianet News TeluguAsianet News Telugu

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో అద్భుత ఘట్టం... పరిశీలించిన పిపిఏ సీఈవో

పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

Dec 20, 2020, 2:19 PM IST

పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గేట్ల అమరిక కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా పోలవరం ప్రాజెక్టు పనులపై పిపిఎ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ(ఆదివారం) తన బృందంతో ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన అయ్యర్ కు అధికారులు, మెగా ఇంజినీరింగ్ నిపుణులు పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఇటీవలే ఆర్మ్ గడ్డర్లను ఏర్పాటు చేశామని ఇక గేట్ల బిగింపు మొదలుపెడతామని చెప్పారు. ప్రాజెక్ట్ స్పిల్ వే, ఎగువ కాపర్ డ్యామ్ సహా ఇతర పనులను అయ్యర్ బృందం పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది.