రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దర్ని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి..
కృష్ణా జిల్లా గంగూరులో మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.
కృష్ణా జిల్లా గంగూరులో మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది. పెనమలూరు నుండి గంగూరుకు వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరిని ఢీ కొట్టింది. దీంతో కారుకాలే చిన్నా అనే 53 యేళ్ల వ్యక్తి అక్కడికిక్కడే మృతి చెందాడు. వేమూరి ప్రసాద్ అనే మరో యాభైయేల్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో ప్రమాదానికి కారమణమైన కారులోని ఇద్దరిని పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.