మంట కలిసిన మానవత్వం.. నడిరోడ్డులో పసికందును వదిలేసిన కిరాతకులు..
విజయనగరం జిల్లా సాలూరులో నడిరోడ్డు లో నవజాత శిశువును వదిలేసి వెళ్లారు కసాయి తల్లిదండ్రులు.
విజయనగరం జిల్లా సాలూరులో నడిరోడ్డు లో నవజాత శిశువును వదిలేసి వెళ్లారు కసాయి తల్లిదండ్రులు. ఇలాగే మొన్న బొబ్బిలిలో ఇద్దరు నవజాత శిశువుల్ని నడి రోడ్డుఫై వదలి వెళ్లిన ఘటన మరువకముందే సాలూరు మళ్లీ అదే జరిగింది. సాలూరులోని నాయుడు వీధి జంక్షన్ లో పసికందును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందచేశారు. పట్టణ ఎస్సై శ్రీనివాస్ ఆ శిశువును స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.