అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి... నివాళి అర్పించిన చంద్రబాబు

విజయవాడ: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 

First Published Mar 16, 2021, 3:39 PM IST | Last Updated Mar 16, 2021, 3:39 PM IST

విజయవాడ: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికన పొట్టి శ్రీరాములును కొనియాడుతూ ఓ ట్వీట్ చేశారు. తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని... అంతకుముందే దళితులకు ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం కూడా అహింసాయుత పోరాటం చేసారన్నారు. ఆ మానవతావాది జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.