జనావాసాల్లో... ఒక్కసారిగా కుప్పకూలిన 60 అడుగుల భారీ టవర్
విశాఖపట్నం: గాజువాకలో జనావాసాల మధ్య నిర్మిస్తున్న 60 అడుగుల సెల్ టవర్ ఒక్కసారిగా కుప్పకూలింది.
విశాఖపట్నం: గాజువాకలో జనావాసాల మధ్య నిర్మిస్తున్న 60 అడుగుల సెల్ టవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. సెల్ టవర్ ను భారీ క్రేన్లతో నిర్మిస్తుండగా బరువు ఎక్కువయి ప్రమాదం జరిగింది. సెల్ టవర్ కుప్పుకూలడంతో పాటు క్రేన్ కూడా ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం ఎప్పుడూ రద్దీగా వుండే జనావాసాల్లో చోటుచేసుకున్నా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.