రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ... దేవాదాయమంత్రితో స్వరూపానందేంద్ర

విశాఖపట్నం: రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతా మూర్తులపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్రను  దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు.

First Published Jan 3, 2021, 3:03 PM IST | Last Updated Jan 3, 2021, 3:03 PM IST

విశాఖపట్నం: రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతా మూర్తులపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్రను  దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా దేవాలయాలపై వరుస దాడులపై స్వరూపానందేంద్రను ఆందోళన వ్యక్తం చేశారు.  ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందని హెచ్చరించారు. 

రామతీర్థం ఘటనపై తక్షణం నిజనిర్ధారణ కమిటీని వేయాలని మంత్రికి స్వరూపానందేంద్ర సూచించారు. అంతేకాకుండా నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితిని విధించాలన్నారు. దోషులకు కఠిన దండన వేయాలన్నారు. వాస్తవాలను వెలికి తీయడంలో పోలీసులు విఫలమయ్యారని స్వరూపానందేంద్ర ఆరోపించారు.