Asianet News TeluguAsianet News Telugu

మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షణలో... సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ఘట్టం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు.

First Published Feb 26, 2021, 9:43 AM IST | Last Updated Feb 26, 2021, 9:48 AM IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు.నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు.పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.వర్క్ చార్ట్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో చూసారు.వర్క్ సైట్ లో అన్ని విభాగాల నుంచి బ్లాక్ ల వారిగా సంబంధించిన సిబ్బంది ఉన్నారో లేదో తనిఖీ చేశారు.

బి4 ర్యాప్ట్ ఫుట్టింగ్ ను మంత్రి పరిశీలించారు. ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ ఈ నిర్మాణంలో కీలక ఘట్టమని మంత్రి అన్నారు. ఒక్క ఫుట్టింగ్ లో 115 టన్నుల స్టీల్,780 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అంటే 8 వేల బస్తాల సిమెంట్ వినియోగించినట్లు ఆయన తెలిపారు. ర్యాప్టింగ్ కు వారం రోజులు పడితే కాంక్రీట్24 గంటల్లో పూర్తయిందని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణం పకడ్బందీగా జరుగుతున్నట్టు చెప్పారు.200 సంవత్సరాలు నిర్మాణం పటిష్టంగా ఉండేలా,భూకంపాలు సైతం తట్టుకునేలా నాణ్యతతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐఐటి నిపుణుల సూచన,స్ట్రక్చర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.