Asianet News TeluguAsianet News Telugu

మెడ్ టెక్ జోన్ లో నైపుణ్య విజ్ఞాన కేంద్రం... ప్రారంభించిన మంత్రి మేకపాటి

విశాఖలో మెడ్ టెక్ జోన్ లో ఏర్పాటుచేసిన  నైపుణ్య విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  ప్రారంభించారు.

First Published Jan 20, 2021, 4:15 PM IST | Last Updated Jan 20, 2021, 4:15 PM IST

విశాఖలో మెడ్ టెక్ జోన్ లో ఏర్పాటుచేసిన  నైపుణ్య విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...బయో టెక్నాలజీకి సంబంధించిన స్కిల్ విజ్ఞాన్ సెంటర్ తో వైద్య రంగంలో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. ఏపీఎమ్ జెడ్ లో కొత్త టెక్నాలజీతో మాస్కులు, వెంటిలేటర్ల తయారీ విధానాన్ని పరిశీలించారు. అలాగే వైద్య పరికరాల తయారీ, పరిశోధన, టెక్నాలజీ గురించి మాట్లాడుతూ మెడ్ టెక్ జోన్ శాస్త్రవేత్తలను మంత్రి ప్రశంసించారు.
అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన యంత్రాలు, వాటి పనితీరు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి. 

65 డెసిబుల్ స్థాయి ధ్వని నియంత్రణ నిర్మాణం, మాస్కులలో సూక్ష్మజీవుల అంతం చేసే ప్రక్రియ, క్లీన్ రూమ్‌,  వెంటిలేటర్ల తయారీలో అడ్వాన్స్ టెక్నాలజీ తదితర యూనిట్ల పరిశీలించారు. 
ఫ్యూచర్ టెక్నాలజీ, అడ్వాన్స్ మెడికల్ ఎక్విప్ మెంట్ ల గురించి మంత్రికి వివరించిన మెడ్ టెక్ జోన్ ఎండీ జితేందర్ శర్మ