Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎంపీ బాలశౌరి ప్లెక్సీ ధ్వంసం... అందుకే చించేసాడట..!

మచిలీపట్నం : అధికార వైసిపి ఎంపీ బాలశౌరి ప్లెక్సీ ధ్వంసం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. 

First Published Dec 20, 2022, 4:36 PM IST | Last Updated Dec 20, 2022, 4:36 PM IST

మచిలీపట్నం : అధికార వైసిపి ఎంపీ బాలశౌరి ప్లెక్సీ ధ్వంసం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ ప్లెక్సీని చించేసింది రాజకీయ ప్రత్యర్థులు కాదని... ఈ వ్యవహారంలో ఎలాంటి రాజకీయాలు లేవని పోలీసులు తేల్చారు. మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయం వద్ద వైసిపి నేత శ్రీను ప్లెక్సీని ఏర్పాటుచేసారని పోలీసులు తెలిపారు. అయితే శ్రీనుతో లంకె రమేష్ కు పాత తగాదాలు వున్నాయని... ఇదే కోపంతో ప్లెక్సీని చించినట్లు తెలిపారు. ప్లెక్సీలో శ్రీను వుండబట్టే చించేసినట్లు రమేష్ ఒప్పుకున్నట్లు చిలకలపూడి సీఐ రాజశేఖర్ వెల్లడించారు. 

Video Top Stories