విశాఖ జిల్లాలో విషాదం... పురుగుల మందు తాగి యువతీ యువకుడి ఆత్మహత్య

విశాఖపట్నం: పెళ్లికి పెద్దలు అంగీకరించకో లేక ఇంకా ఏమయినా కష్టం వచ్చిందో గాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న యువతీ యువకుడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. విశాఖ జిల్లాలోని కసింకోట మండలం మోసయ్యపేట పంచాయతీ శివారు గోకివానిపాలెంలో నోట్లో నురగతో యువతి, యువకుడి మృతదేహాలు పడివుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆత్మహత్య చేసుకున్న యువకుడు బుచ్చియ్యపేట గ్రామానికి చెందిన మజ్జీ శ్రీను, యువతి కె కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన చల్లపల్లి హేమలతగా పోలీసులు గుర్తించారు. ఇరువురి  కుటుంబసభ్యులకు ఆత్మహత్యపై సమాచారం అందించారు. యువతీ యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

First Published Mar 31, 2022, 5:53 PM IST | Last Updated Mar 31, 2022, 5:53 PM IST