Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు సంకెళ్లు ఎందుకు ..... పాలకొల్లు శాసనసభ్యులు డా. నిమ్మల రామానాయుడు

ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేసారంటూ నల్ల కండువాతో ప్లేబోర్డుతో అసెంబ్లీ వెలుపల వర్షం పడుతున్నా నిలువు కాళ్లపై గంట సేపు నిలబడి నిరసన తెలిపిన పాలకొల్లు శాసనసభ్యులు డా. నిమ్మల రామానాయుడు . 

ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేసారంటూ నల్ల కండువాతో ప్లేబోర్డుతో అసెంబ్లీ వెలుపల వర్షం పడుతున్నా నిలువు కాళ్లపై గంట సేపు నిలబడి నిరసన తెలిపిన పాలకొల్లు శాసనసభ్యులు డా. నిమ్మల రామానాయుడు . మహిళల సొంత ఇంటి కల నెరవేర్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు ప్రారంభించి 90 శాతం పూర్తిచేస్తే, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి గాని, ఒక్క అరబస్తా సిమెంట్ గాని పెట్టకుండా మిగిలిన 10 శాతం పూర్తి చెయ్యకుండా మేము కట్టిన ఇళ్లకు వాళ్ల పార్టీ రంగులు వేసుకుంటున్నారన్నారు.  మిగిలిన 10 శాతం పూర్తిచేసి అన్నమాట ప్రకారం ఉచితంగానే టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.