చంద్రబాబు అరెస్టుకు నిరసన..నేతల అరెస్ట్...
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ మచిలీపట్నం కోనేరుసెంటరులో టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ మచిలీపట్నం కోనేరుసెంటరులో టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నాయకత్వంలో ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో టైర్లు తగలపెట్టడంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి రవీంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మరికొంత మంది పోలీసుల అదుపులో ఉన్నారు.