తిరుపతి, తుని మున్సిపల్ ఎన్నికలపై జగన్ సంచలన కామెంట్స్

Share this Video

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ ఏ తప్పు చేయలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తిరుపతి, తుని, పాలకొండ మున్సిపల్ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

Related Video