Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ భారీ వర్షాలతో ఏపీ వరదలు... ఎన్టీఆర్ జిల్లాలో ఇదీ పరిస్థితి...

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులువకంలు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులువకంలు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఇలా నిన్న(గురువారం) తెలంగాణలో కురిసిన భారీ వర్షం ఏపీలో వరదలకు కారణమయ్యింది. తెలంగాణలో కురసిన వర్షపునీరు కట్టలేరువాగులో చేరి ఎన్టీఆర్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. వరదనీరు చుట్టుముట్టడంతో గంపలగూడెం మండలంలోని వినగడప, తోటమూల మధ్య  కట్టలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో మైలవరం, నూజివీడు,విజయవాడ లకు వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరుచేరి దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.