ఏకంగా మాజీ ఎమ్మెల్యే తనయుడి భూమే కబ్జా...పామర్రులో కిలాడీ జంట అరెస్ట్
విజయవాడ : నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఏకంగా రిటైర్డ్ జడ్జి, మాజీ ఎమ్మెల్యే తనయుడికి చెందిన విలువైన భూమిని కబ్జా చేసిన కిలాడి దంపతులను పోలీసులు అరెస్ట్ చేసారు. కృష్ణా జిల్లా పామర్రులో ఈ భూ కబ్జా వ్యవహారం వెలుగుచూసింది.
పామర్రు పట్టణంలోని విజయవాడ రోడ్డు బ్యాంక్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే తమ్మా కోట్టమ్మరెడ్డి తనయుడు వినోద్ రెడ్డికి 44 సెంట్ల భూమి వుంది. ఈ భూమిపై కన్నేసిన ఓ కిలాడీ జంట నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఈ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వినోద్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగ రిజిస్ట్రేషన్ కు పాల్పడినట్లు కేసు నమోదు చేసి మచిలీపట్నంకు చెందిన అలీతో పాటు అతడి భార్యను అరెస్ట్ చేసారు. ఈ కేసుకు భూ కబ్జా వ్యవహారంతో మరికొందరికి సంబంధాలు ఉన్నాయని... దానిపై విచారణ కొనసాగుతుందని సీఐ వెంకటనారాయణ వివరించారు.