Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం... రోడ్డుపై బైఠాయించిన దేవినేని ఉమ అరెస్ట్

విజయవాడ  : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్చి తన తండ్ర వైఎస్సార్ పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. 

First Published Sep 21, 2022, 11:35 AM IST | Last Updated Sep 21, 2022, 11:35 AM IST

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుమార్చి తన తండ్ర వైఎస్సార్ పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి శాసనసభాపక్షం అసెంబ్లీలో, ఇతర నాయకులు తమ ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. ఇలా ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రవు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ ఆందోళనకు దిగడంతో కాస్సేప్పు ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో టిడిపి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేవినేని ఉమను అరెస్ట్ చేసిన పోలీసులు భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.