
Deputy CM Pawan Kalyan Inspects Gollaprolu New Bridge
గొల్లప్రోలు హౌసింగ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న నూతన బ్రిడ్జిని ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు రాకపోకలు సులభంగా మారేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.