Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళంలో కుప్పకూలిన భారీ వంతెన... నదిలో పడిపోయిన వాహనాలు

ఇచ్చాపురం : బ్రిటీష్ కాలం నాటి వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఇచ్చాపురం : బ్రిటీష్ కాలం నాటి వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జాతీయ రహదారి పైనుండి ఇచ్చాపురం పట్టణానికి వెళ్లే దారిలో బాహుదా నదిపై గల వంతెన కూలిపోయింది. ఇవాళ ఉదయం భారీ లోడ్ తో ఓ లారీ వంతెన పైనుండి వెళుతుండగా పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది. దీంలో లారీతో పాటు ఇతర వాహనాలు కూడా కింద పడిపోయాయి. కానీ ఎండాకాలం కావడంతో నదిలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇచ్చాపురం నుండి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు బ్రిటిష్ కాలంలో (1929) బాహుదా నదిపై వంతెన నిర్మించారు. ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ బ్రిడ్జి స్థానంలో నూతనంగా మరో బ్రిడ్జిని నిర్మించాలని ఇచ్చాపురం ప్రజలు కోరుతున్నారు.