దేవాలయాలపై వరుస దాడులు... చేసేదెవరో అప్రస్తుతం, కానీ: చినజీయర్ స్వామి
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని... ఇప్పటికి 50కి పైగా సంఘటనలు జరిగాయని ప్రముఖ ఆద్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని... ఇప్పటికి 50కి పైగా సంఘటనలు జరిగాయని ప్రముఖ ఆద్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) సింగరాయకొండపై వెలసిన నరసింహ స్వామి చేతులు ద్వంసం చేశారన్నరు. ఇలా ఎవరు చేస్తున్నారనేది అప్రస్తుతం.. కానీ పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని సూచించారు.
ధనుర్మాస ఉత్సవాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తామన్నారు చినజీయర్ స్వామి.
ఆలయాల ఉనికికే భంగం కలిగించే స్థితి వచ్చిన నేపథ్యంలో తాము మౌనంగా ఉండలేమని...అందువల్లే రాష్ట్ర పర్యటనకు సిద్దమయ్యామన్నారు.