కన్నా సత్తెనపల్లిలో పోటీ చేస్తారో పోటీ చేస్తారా..?: అంబటి అనుమానం

సత్తెనపల్లి : అసలు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో పోటీ చేస్తాడో లేదో కూడా తెలియడంలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

| Updated : Sep 01 2023, 04:34 PM
Share this Video

సత్తెనపల్లి : అసలు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో పోటీ చేస్తాడో లేదో కూడా తెలియడంలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కన్నాకు పార్టీలు మార్చడం, నియోజకవర్గాలు మార్చాడం కొత్తేమీ కాదంటూ మంత్రి ఎద్దేవా చేసారు. గతంలో ఇదే చంద్రబాబును దూషించిన ఇప్పుడు అదే పార్టీలో చేరాడు... అసలు కన్నాకు నైతిక విలువలే లేవన్నారు. గతంలో సైకిల్ పార్టీని ఓడించమని తిరిగాడు... ఇప్పుడు సైకిల్ పార్టీని గెలిపించమని తిరుగుతున్నాడు...  పూటకోసారి మాటమార్చే ఇలాంటి నాయకున్ని సత్తెనపల్లి ప్రజలు నమ్మబోరని అంబటి అన్నారు.సత్తెనపల్లి నియోజకవర్గం ముపాళ్ళ మండలం తొండపి గ్రామానికి చెందిన కొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలు  వైసీపీలో చేరారు. మంత్రి అంబటి రాంబాబు ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొని వైసిపి కండువా కప్పారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణతో పాటు టిడిపి, జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి ఎంతమంది వస్తాదులు వచ్చిన తనను ఏమి చేయలేరని  అంబటి రాంబాబు అన్నారు. 

Read More

Related Video