Asianet News TeluguAsianet News Telugu

AP cabinet meeting: నేడే జగన్ కేబినెట్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివేనా..? 

AP cabinet meeting: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.  చర్చించే కీలక అంశాలివేనా..? 

Crucial AP cabinet meeting today to take key decisions KRJ
Author
First Published Jan 31, 2024, 5:00 AM IST | Last Updated Jan 31, 2024, 5:00 AM IST

AP cabinet meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ కీలక సమావేశంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని APSRTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తే..  2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను సమర్సించే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లో ప్రభుత్వం  చేసే వ్యయంపై ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పథకాన్ని కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

 
ఏపీలో  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడితే.. దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై  రూ. 1,440 కోట్ల అదనపు భారం పడుతుంది. మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు ఈ పథకం దోహదపడుతుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో పలు మార్పులను కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలిస్తారని, దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

అలాగే.. డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి సంబంధించిన మరో ముఖ్యమైన అంశంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. గడిచిన 4 ఏళ్లుగా ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి. సమస్యను లేవనెత్తడం ద్వారా నిరుద్యోగులను తమవైపుకు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనం, మెగా హౌసింగ్,  నవరత్నాలు, రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, వ్యవసాయ రుణమాఫీ వంటి ఇతర అంశాలు క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios