Lalu Prasad Yadav: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ట్రాప్ లో తాను కూడా పడ్డానని సరదాగా అన్నారు. అందరి లాగే తాను కూడా 15 లక్షల అత్యాశతో కుటుంబంలోని అందరి సభ్యులపై ఖాతాలు తెరిపించానని, కానీ మోసపోయానని లాలూ యాదవ్ సెటైర్ వేశారు.