Lalu Yadav : దాణా కుంభకోణం కేసులో నిందితుడైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖాలు చేసింది. ఈ పిటిషన్ ను శుక్రవారం (ఆగస్టు 25) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ తరుణంలో సుప్రీం కోసం ఎలాంటి నిర్ణయం వెల్లడించిందంటే..?
Lalu Yadav : దాణా కుంభకోణం కేసులో నిందితుడైన రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ప్రసాద్‌కు షాక్ తగిలింది. లాలూ బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన సీబీఐ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాంచీ హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 18న సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పై సుప్రీం కోర్టు ఆగస్టు 25న విచారణ జరిపింది.
సీబీఐ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ తన వాదనలు వినిపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇటీవలే ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందని, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని తిరిగి జైల్లోకి పంపించాలని సీబీఐ కుట్ర చేస్తుందని సంచలన ఆరోపణ చేశారు.
ఈ తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ తరపు న్యాయవాది వాదనలను సిబిఐ తరఫున న్యాయవాది తోసిపుచ్చాడు. సీబీఐ తరుపున న్యాయవాది తన వాదనను వినిపిస్తూ.. లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల బ్యాట్మెంటన్ ఆడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఆ వీడియోలో ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఎలా ఆటలు ఆడగలరని ప్రశ్నించారు.
అంతేకాకుండా ఆయన ఇటీవల పలు రాజకీయ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు పడిన శిక్షను తగ్గించే క్రమంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు జార్ఖండ్ హైకోర్టు జూరు చేసిన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని సీబీఐ తరుపున న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ కేసు విచారణను అక్టోబర్ 17 కు వాయిదా వేస్తున్నట్లు అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది.
రాష్ట్రీయ జనతా జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు దానా కుంభకోణం కేసుతో ఇతర కేసులో జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బేలు మంజూరు చేసింది. బీరు మీద వచ్చిన లాలు ప్రసాద్ యాదవ్ గతేడాది డిసెంబర్లో సింగపూర్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు రోహిణి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీని దానం చేసింది. ఇటీవల ఆయన ప్రతిపక్షాల కూటమి సమావేశానికి హాజరయ్యారు. ఈ పరిణామం తో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సిబిఐ సుప్రీంకోర్టులో ఆశ్రయించింది.