హైదరాబాద్: ఆవు దూడపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ వర్మ అనే వ్యక్తి ఎల్బీ నగర్ లో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను సరూర్  నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతను ఆవు దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని పసిగట్టిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

గతంలో కూడ ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకొన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా ఘటన గతంలో కూడ చోటు చేసుకొంది. ఈ ఏడాది జూలై 9వ తేదీన ఇదే తరహా ఘటన చోటు చేసుకొంది.

ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.