MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుని హీరో చెంప పగలగొట్టిన మృణాల్‌ ఠాకూర్‌.. డైరెక్టర్‌ బలవంతం చేయడంతో తప్పక అంతపని

మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుని హీరో చెంప పగలగొట్టిన మృణాల్‌ ఠాకూర్‌.. డైరెక్టర్‌ బలవంతం చేయడంతో తప్పక అంతపని

మృణాల్‌ ఠాకూర్‌ హిందీలో `జెర్సీ` చిత్రంలో నటించింది. ఇందులో షాహిద్‌ కపూర్‌తో ఆ సీన్‌ చేయడం చాలా ఇబ్బంది పడిందట. తాజాగా ఆ విషయం బయటపెట్టింది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 26 2024, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు తెర సీతలా మారిపోయింది మృణాల్‌ ఠాకూర్. `సీతారామం` చిత్రం చేశాక ఆమెని అంతా సీతగానే చూస్తున్నారు. సీతగానే అభిమానిస్తున్నారు అభిమానులు. తెలుగులో మంచి అభిమానగనం కూడా ఏర్పడింది. తెలుగులో బిజీగా ఉంది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అంతకు ముందు అనేక స్ట్రగుల్స్ ఫేస్‌చేసిన మృణాల్‌కి `సీతారామం` మూవీ లైఫ్‌ ఇచ్చింది. ఆమెని పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చింది. అన్ని భాషల్లోనూ అభిమానులను ఏర్పర్చింది. కానీ తెలుగు ఆడియెన్స్ మృణాల్‌ని ఓన్‌ చేసుకున్నారు. తెలుగు హీరోయిన్‌గానే ఆదరిస్తున్నారు. 

39

`హాయ్‌ నాన్న`, ఇటీవల వచ్చిన `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాలతో మరింతగా ఆకట్టుకుంది మృణాల్‌. కానీ ఇందులో `హాయ్‌ నాన్న` ఫర్వాలేదనిపించుకోగా, `ఫ్యామిలీ స్టార్‌` డిజప్పాయింట్‌ చేసింది. ఈ మూవీ ఆడలేదు. దీంతో మృణాల్‌కి మళ్లీ ఫ్లాప్‌ పడింది. అయితే ఓ ఇంటర్వ్యూలో మృణాల్‌.. `జెర్నీ` సినిమాని గుర్తు చేసుకుంది మృణాల్‌ ఠాకూర్. అందులో హీరోని కొట్టే సీన్‌ గురించి మాట్లాడింది. 

49

మృణాల్‌ ఠాకూర్‌ హిందీలో `జెర్సీ` చిత్రంలో నటించింది. ఇది తెలుగులో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన `జెర్సీ`కి రీమేక్‌. తెలుగు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి హిందీలోనూ రూపొందించారు. షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. ఇందులో కొడుక్కి జెర్సీ కొనేందుకు హీరో వద్ద డబ్బుల్లేవ్‌. బాగా విసిగిస్తే అతని బర్త్ డే రోజే కొడతాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాక ఏమైందని అమ్మ అడిగితే, క్రికెట్‌ ఆడుతుంటే బాల్‌ తగిలిందని అబద్దం చెబుతాడు కొడుకు. దీంతో ఎమోషనల్‌ అయిన హీరో ఇంట్లోకి వెళ్లి భార్య( హీరోయిన్‌) పర్స్ లో నుంచి డబ్బులు తీసుకుని జెర్సీ కొనివ్వాలని నిర్ణయించుకుంటాడు. 
 

59

దీంతో పర్స్ లో డబ్బలు తీసుకునే సమయంలో ఆమె చూస్తుంది. భార్య వద్ద దొంగతనం చేస్తున్నావా అంటూ గొడవ పెట్టుకుంటుంది. ఈ క్రమంలో హీరోని కొడుతుంది హీరోయిన్‌. అంటే సినిమాలో షాహిద్‌ కపూర్‌ని, మృణాల్‌ ఠాకూర్‌ చెంపపై కొడుతుంది. ఈ సీన్‌ సినిమాలో బాగా పండింది. సినిమాలో హైలైట్ గానూ నిలుస్తుంది. 

69

ఇదిలా ఉంటే తాజాగా ఈ సీన్‌ని గుర్తు చేసుకుంది మృణాల్‌. ఆ సీన్‌ తాను బాగా చేయలేకపోయానని తెలిపింది. షాహిద్‌ కపూర్‌ తనకు ఇష్టమైన హీరో అని, ఆయన్ని చెంపపై అలా గట్టిగా కొట్టలేకపోయానని, చాలా ఇబ్బంది పడినట్టు తెలిసింది మృణాల్‌. ఈ సీన్‌లో నటించాలంటే భయమేసిందని, అంత పెద్ద స్టార్‌ని ఎలా కొట్టడమనే ఇబ్బంది పడినట్టు తెలిపింది మృణాల్‌ ఠాకూర్. 
 

79

తాను షాహిద్‌ కపూర్‌కి పెద్ద అభిమానిని అని, ఆయనతో కలిసి నటించే అవకాశం రాఆగానే వెంటనే ఓకే చెప్పినట్టు, మొదటి రోజు షూటింగ్‌లో ఆయన నవ్వు చూస్తూ చాలా సేపు ఉండిపోయిందట. ఆయన నవ్వు సినిమాలో ఎలా ఉంది, నిజంగానే అలానే ఉందని చెప్పినట్టు, అలాగే ఆయనతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పింది. 
 

89

సినిమాలో హీరోని చెప్పదెబ్బ కొట్టే సీన్‌ లో చాలా నిదానంగా కొట్టి, ఎడిట్‌లో చేసుకోండి అని చెప్పిందట. కానీ దర్శకుడు ఒప్పుకోలేదని, ఆ సీన్‌లో షాహిద్‌ కూడా బాగా సపోర్ట్ చేశారని, మీ మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ని గుర్తు చేసుకుని నన్ను చెప్పదెబ్బ కొట్టండి` అనేసలహా కూడా ఇచ్చాడట. కానీ ఆ సీన్‌ చేయడానికి తనకు మూడు గంటలు పట్టిందని చెప్పింది మృణాల్‌. 
 

99
instagram

instagram

కెరీర్‌ గురించి చెబుతూ, తనకు ఒకేసారి ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయాలని లేదని, ఒక్కటి చేసినా బెస్ట్ ఉండాలని, గుర్తిండిపోయే సినిమా చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఇటీవల `ఫ్యామిలీ స్టార్`లో నటించిన మృణాల్‌ ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved