Asianet News TeluguAsianet News Telugu

గద్వాల ‘డర్టీ పిక్చర్’ కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఏ సంబంధం లేని మహిళ ఫొటో వైరల్..

సంచలనం సృష్టించిన గద్వాల న్యూడ్ వీడియోలు, ఫొటోల కేసులో ఏ మాత్రం సంబంధం లేని ఓ మహిళ ఫొటో వైరల్ అయ్యింది. దీనిమీద ఆ మహిళ ఎస్పీని ఆశ్రయించింది. 

woman photo leaked without her involvement in honey trap case in gadwal
Author
First Published Nov 10, 2022, 10:00 AM IST

మహబూబ్ నగర్ :  జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళలు, యువతులను ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిన వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని ఓ మహిళ ఫొటోను వైరల్ చేసిన విషయం బయటకు వచ్చింది.  సదరు మహిళ  దీనిపై బుధవారం ఎస్పీ రంజన్ రతన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తాను, తన కుటుంబం అంటే పడని వారు కావాలనే ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫోటోను పోస్ట్ చేశారని వాపోయారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిని శిక్షించాలని కోరారు.

ఆమె స్టేట్మెంట్లో రికార్డు చేసిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, మహిళలపై ట్రాప్, బ్లాక్మెయిలింగ్ ఉదంతంలో ఇప్పటివరకు గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేశ్ అలియాస్ మహేశ్వర్ రెడ్డితో పాటు నిఖిల్, వినోద్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ పోలీస్ అధికారిపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకులు, కౌన్సిలర్లు, ఓ ముఖ్యనేత అనుచరుడు ఉన్నారని.. వారిని తపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

మహిళలు, యువతులకు న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..ముగ్గురు అరెస్ట్..నిందితుల్లోల పోలీసులు, పొలిటీషియన్స్ ??

ఈ క్రమంలో కీలక వ్యక్తులను అరెస్టు చేయాలంటూ...బుధవారం ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, బిజెపి, సిపిఐ, సిపిఎం, వైయస్ఆర్టీపీ, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో  గద్వాలలో  నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేయాలని, అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పి రంజన్ రతన్ కుమార్ లకు వినతి పత్రాలు అందజేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. స్థానిక పోలీసులపై ఒత్తిడులు ఉన్నాయని, దీంతో విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పట్టణంలోకి అధికారులు రహస్య విచారణ చేపట్టారని రోజంతా హైడ్రామా నడవడం గమనార్హం.

గద్వాల న్యూడ్ వీడియో కాల్స్ కేసు.. తవ్వేకొద్ది వెలుగులోకి దారుణాలు, పెరుగుతున్న బాధితులు

మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఘటన పరిణామాలపై ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పార్టీ అధిష్టానం మాట్లాడినట్లు తెలిసింది. ముందుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారని వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాతే గద్వాలకు చెందిన ముఖ్య నేతతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎవరున్నా ఉపయోగించవద్దని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు సమాచారం. పోలీసుల విచారణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని సూచించినట్లు  తెలిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios