MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫోటోలు చూసి మోసపోవద్దు, ఆమెకి 23 ఏళ్ళ కూతురు ఉంది..సమ్మర్ వెకేషన్ లో నటి సంచలనం

ఫోటోలు చూసి మోసపోవద్దు, ఆమెకి 23 ఏళ్ళ కూతురు ఉంది..సమ్మర్ వెకేషన్ లో నటి సంచలనం

హిందీ టివి సీరియల్స్ తో నటి శ్వేతా తివారి బాగా పాపులర్ అయింది. ఆమె టివి నటి అయినప్పటికీ గ్లామర్ పరంగా హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉంది. అందంగా ఉన్నప్పటికీ బుల్లితెర నటీమణులకు క్రేజ్ తక్కువ. కానీ శ్వేతా తివారి అందుకు అతీతం.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 09 2024, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హిందీ టివి సీరియల్స్ తో నటి శ్వేతా తివారి బాగా పాపులర్ అయింది. ఆమె టివి నటి అయినప్పటికీ గ్లామర్ పరంగా హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉంది. అందంగా ఉన్నప్పటికీ బుల్లితెర నటీమణులకు క్రేజ్ తక్కువ. కానీ శ్వేతా తివారి అందుకు అతీతం. ప్రస్తుతం సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో ఆమెకి బాగా తెలుసు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో శ్వేతా తివారీని 5 మిలియన్లకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు శ్వేతా తివారి క్రేజ్ ఎలా ఉందో అని. శ్వేతా తివారి పార్టీలకు, ఫంక్షన్స్ కి, వెకేషన్స్ కి వెళితే చాలు ఆ దృశ్యాలు సొసైల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. 

38

శ్వేతా తివారి తాజా ఫోటోలు ఇంటర్నెట్ లో పెద్ద దుమారమే రేపుతున్నారు. శ్వేతా తివారి సమ్మర్ వెకేషన్ కోసం థాయ్ ల్యాండ్ వెళ్ళింది. అక్కడ జలకాలాడుతూ గ్లామర్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక్కసారిగా ఆమె గ్లామర్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

 

48

ఆమె గ్లామర్ చూసి శ్వేతా తివారి వయసు ఏ 20 లేదా 30 అనుకుంటే మోసపోయినట్లే. ఆమె వయసు 43 ఏళ్ళు. శ్వేతా తివారీకి 23 ఏళ్ళ కూతురు కూడా ఉంది. శ్వేతా తివారి కుమార్తె పాలక్ తివారి కూడా హిందీ సీరియల్స్ లో నటిగా రాణిస్తోంది. 

58

శ్వేతా తివారి థాయ్ ల్యాండ్ వెకేషన్ లో వైట్ టాప్ ధరించి వాటర్ లో ఫోజులు ఇచ్చింది. హీరోయిన్లు కూడా అసూయ పడే విధంగా ఆమె గ్లామర్ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

68

 ఎంతటి అందాల భామ అయినా 40 ఏళ్ళు నిండితే వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ శ్వేతా తివారి విషయంలో వయసు వెనక్కి వెళుతోందా అని అనిపించక మానదు. ఇంత గ్లామర్ గా కనిపించే శ్వేతా తివారి జీవితంలో పెళ్లి అనేది కలసి రాలేదు. 

78

1998లో శ్వేతా తివారి 18 ఏళ్ళ వయసులోనే వివాహం చేసుకుంది. రాజా చౌదరి అనే వ్యక్తితో శ్వేతా మొదటి వివాహం జరిగింది. వీరికి పాలక్ తివారి కుమార్తె గా జన్మించింది. తన భర్త రాజా చౌదరి మద్యానికి బానిసై హింసకి పాల్పడుతుండటంతో భరించలేక 2007లో విడాకులు తీసుకుంది. 

88

శ్వేతా తివారి 2010లో హిందీ బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె అభినవ్ కోహ్లీ అనే వ్యక్తి ప్రేమలో పడింది. అభినవ్ ని శ్వేతా వివాహం చేసుకుంది. అయితే వీళ్లిద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తి విడిపోయారు. వీళ్లిద్దరి ప్రైవేట్ లైఫ్ పై ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. తనపై, తన కూతురుపై అభినవ్ దాడికి పాల్పడుతున్నాడు అంటూ శ్వేతా కేసు నమోదు చేసింది. 2019లో వీళ్ళిద్దరూ విడిపోయారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivatioal Song: జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వింటే బ‌తికే విధాన‌మే మారుతుంది
Recommended image2
Fact: విజయశాంతిని బాలకృష్ణ పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? అసలు నిజం ఇదే.. వీరి మధ్య గ్యాప్‌కి కారణం ఏంటంటే?
Recommended image3
Pawan Kalyan: చిన్నారి అభిమాని కోరికి తీర్చిన పవన్ కళ్యాణ్, నిరంజన్ ఫ్యామిలీపై పవర్ స్టార్ వరాల జల్లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved