Asianet News TeluguAsianet News Telugu

గద్వాల న్యూడ్ వీడియో కాల్స్ కేసు.. తవ్వేకొద్ది వెలుగులోకి దారుణాలు, పెరుగుతున్న బాధితులు

గద్వాల న్యూడ్ కాల్ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిందితుల దారుణాలపై జిల్లా ఎస్పీకి పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 

gadwal Nude Call Case updates
Author
First Published Nov 9, 2022, 4:31 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాల న్యూడ్ కాల్ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ ఫోటోలు సోషల్ మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసిన నిందితులు వాటిని మార్ఫింగ్ చేసి తమను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫిర్యాదు చేశారు కొందరు బాధితులు. ఈ వ్యవహారంతో తాము మానసిక క్షోభ అనుభవిస్తున్నామని వాపోతున్నారు బాధితులు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు . శాఖాపరంగా ఓ ఎస్సైపై చర్యలు తీసుకున్నారు అధికారులు. 

కాగా.. గద్వాలకు చెందిన మహేశ్వర్ రెడ్డి , నిఖిల్‌లు ప్రేమ పేరుతో మహిళలు, విద్యార్ధినులను ట్రాప్ చేస్తున్నారు. మహిళలు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేలా చేసి దానిని రికార్డ్ చేస్తున్నారు. తర్వాత బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు తాము చెప్పిన వారితో గడపాలంటూ వేధిస్తున్నారు. లేని పక్షంలో ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని , సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మహేశ్వర్ రెడ్డిని అరెస్ట చేశారు. పరారీలో వున్న నిఖిల్ కోసం గాలిస్తున్నారు. 

ALso REad:గద్వాల న్యూడ్ వీడియో కాల్స్ కేసు: ఎస్ఐ హరిప్రసాద్ పై బదిలీ వేటు

మరోవైపు.. ఈ కేసు విషయమై నిందితుల  నుండి ఎస్ఐ లంచం  తీసుకున్నారనే  ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు  మట్టి, ఇసుక మాఫియాకు  ఎస్ఐ అనుకూలంగా   వ్యవహరించారనే  ఆరోపణలున్నాయి. ఈ విషయమై అంతర్గతంగా విచారణ నిర్వహించిన ప్రభుత్వం ఎస్ఐపై బదిలీ వేటు  వేసిందని  ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం  ప్రసారం చేసింది. నాగర్ కర్నూల్ డీఎస్ బీలో  పని చేస్తున్న వి. వెంకటేష్ ను  గద్వాలలోని కేటీదొడ్డి ఎస్ఐగా  బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios