Asianet News TeluguAsianet News Telugu

ఇన్‌స్టా రీల్స్‌తో ట్రాప్.. అబ్బాయిల వీడియో కాల్స్‌ని న్యూడ్‌గా మార్ఫింగ్, ఆపై బెదిరింపులు

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేసిన యువతి .. వారి వీడియె కాల్స్‌ని రికార్డ్ చేసి న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతోంది. దీనిపై బాధితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

woman blackmailed young boy with nude videos in hyderabad
Author
First Published Sep 22, 2022, 6:00 PM IST

న్యూడ్ కాల్స్‌, వీడియోలతో అబ్బాయిలను వేధిస్తోన్న ముఠాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ మరో దారుణం వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేసిన యువతి వారిని తన దారిలోకి తెచ్చుకుంది. అబ్బాయిల వీడియో కాల్స్‌ని రికార్డు చేసి వాటిని న్యూడ్‌గా మార్చి బెదిరింపులకు పాల్పడుతోంది. తను చెప్పినట్లు చేయకపోతే.. వాటిని పోస్ట్ చేస్తానంటూ బెదిరించింది. రూ.5, పది వేలు పంపితేనే వీడియోలు డిలీట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోంది. ఆమె వేధింపులు నానాటికీ తీవ్రం కావడంతో బాధితుడు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఇకపోతే.. ఇటువంటి ఘటనే గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇటీవల చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో బిబిఏ చదువుకునే యువకుడు(20) నివాసముంటున్నాడు. దగ్గర్లోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఈ యువకుడికి ఇటీవల గుర్తుతెలియని మహిళ నుండి ఫోన్ కాల్ వచ్చింది. పరిచయం లేకున్నా యువకుడితో మాటలు కలిపిన మహిళ మెల్లిగా లోబర్చుకుంది. ఇక ప్రతిరోజూ యువకుడితో మాట్లాడుతూ మాయమాటలతో పూర్తిగా వశపర్చుకుంది.  

ALso Read:ఇదేం కోడల్రా బాబోయ్.. అత్తామామల నగ్న వీడియోలు తీసి, భర్తకు బెదిరింపులు..

యువకుడు పూర్తిగా తన మాయలో వున్నాడని నిర్దారించుకున్న మహిళ ప్లాన్ అమలు చేసింది. కైపెక్కించే మాటలతోనే యువకుడికి మత్తెక్కించి నగ్నంగా వీడియో కాల్ చేసేలా చేసింది. ఈ వీడియోను రికార్డ్ చేసి యువకున్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తాను అడిగినన్ని డబ్బులు పంపాలని... లేదంటే అతడి నగ్న వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన విద్యార్థి మొదట 8వేల రూపాయలు మహిళ చెప్పిన అకౌంట్ లో వేసాడు. అయినప్పటికి అతన్ని వదిలిపెట్టకుండా మరిన్ని డబ్బులు కావాలంటూ వేధించసాగింది. దీంతో బాధిత యువకుడు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ ఫోన్ నంబర్, డబ్బులు వేసిన అకౌంట్ నంబర్ తో పాటు ఇతర వివరాలను బాధిత యువకుడి నుండి సేకరించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కిలాడీ మహిళ ఆఛూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా అపరిచితులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని తాడేపల్లి ప్రజలకు పోలీసులు సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios