Asianet News TeluguAsianet News Telugu

నగ్నంగా వీడియో పంపింది.. వారం రోజుల్లోనే రూ.3లక్షలు కాజేసి..

నగరంలోని ఐటీ కారిడార్ లో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి ఓ యువతి ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యింది. ఆ పరిచయం తొలుత ఛాటింగ్ తో మొదలై తర్వాత కాల్స్ దాకా వెళ్లింది. ఇద్దరూ గంటలపాటు ఫోన్ లో మాట్లాడుకునేవారు.

woman black mails IT Employee For Money In Hyderabad
Author
Hyderabad, First Published Jun 10, 2020, 12:18 PM IST

ఒకప్పుడు బాధితులు అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పోలీసులకు వస్తున్న కేసుల్లో సగం మంది బాధితులు అమ్మాయిలు ఉంటే.. మిగిలిన సగం మంది బాధితులు అబ్బాయిలు ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే సులభంగా మోసపోతున్నారు.

చాలా మంది కిలాడీలు ఐటీ కుర్రాళ్లకు వేలం వేసి మరీ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని కేవలం వారం రోజుల్లో రూ.3.63లక్షలు కాజేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని ఐటీ కారిడార్ లో విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి ఓ యువతి ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యింది. ఆ పరిచయం తొలుత ఛాటింగ్ తో మొదలై తర్వాత కాల్స్ దాకా వెళ్లింది. ఇద్దరూ గంటలపాటు ఫోన్ లో మాట్లాడుకునేవారు.

ఆ తర్వాత ఒక రోజు యువతి సదరు ఐటీ ఉద్యోగికి తన న్యూడ్ వీడియో ఒకటి పంపింది. అంతేకాకుండా.. తనది కూడా పంపాలని అడిగింది. అమ్మాయే పంపగా లేనిది తాను పంపితే ఏమౌతుందిలే అనే ధీమాతో పంపించాడు.అంతే ఆ యువకుడి వీక్ పాయింట్ తన చేతికి చిక్కగానే.. బెదిరించడం మొదలు పెట్టింది.

తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతానని.. అతని స్నేహితులకు, కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించడం మొదలుపెట్టింది. వారం రోజుల్లో సదరు యువకుడు ఆమెకు రూ.3.63లక్షలు చెల్లించాడు. ఇంకా ఆమె బెదిరింపులు ఆగకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios