గజ్వేల్: దివ్యను హత్య చేసేందుకు కొన్ని రోజులుగా వెంకటేష్  ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. పలు మార్లు ప్రయత్నించి విఫలమై చివరకు ఈ నెల 18వ తేదీన ఆమెను హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా సమాచారం.  దివ్యను  హత్యచేసేందుకు ఉపయోగించిన కత్తిని వేములవాడలో రూ. 50కు కొనుగోలు చేసినట్టుగా విచారణలో ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.

దివ్యను  హత్య చేసిన తర్వాత సికింద్రాబాద్ నుండి వెంకటేష్ విజయవాడకు వెళ్లాడు. వెంకటేష్ కోసం ఐదు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసిన వెంకటే‌ష్ ను అరెస్ట్ చేసినట్టుగా గజ్వేల్ పోలీసులు గురువారం నాడు సాయంత్రం ప్రకటించారు.  

ఈ నెల 18వ తేదీన సాయంత్రం దివ్యను ఇంట్లోనే వెంకటేష్ కత్తితో దారుణంగా హత్య  చేశాడు. వెంకటేష్ ను 24 గంటల్లో అరెస్ట్ చేశారు. దివ్య, వెంకటేష్ 9, 10వ తరగతులు ఒకే స్కూల్లో చదివారు. ఈ సమయంలోనే వారి మధ్య  స్నేహం ఏర్పడినట్టుగా పోలీసులు చెప్పారు.

Also read:గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి హత్య కేసు: వెంకటేష్, దివ్య రహస్య వివాహం

ఆ తర్వాత ఆమెను ప్రేమించాలని వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే దివ్య, వెంకటేష్ లు పెళ్లి చేసుకొన్నారని  వెంకటేష్ తండ్రి పరశురామ్  బుధవారం నాడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. తన డబ్బులతోనే దివ్యను హైద్రాబాద్‌లో చదివించినట్టుగా ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో వీరి మధ్య విభేదాలు రావడంతో  విడిపోయారని ఆయన చెప్పారు. 

Also read:దివ్య హత్య కేసు: వేములవాడలో లొంగిపోయిన వెంకటేష్

అయితే ఆ తర్వాత  దివ్యను  ప్రేమ పేరుతో  వెంకటేష్ వేధించినట్టుగా పోలీసులు ప్రకటించారు. తనకు దక్కని దివ్య మరొకరికి దక్కకూడదనే ఉద్దేశ్యంతోనే వెంకటేష్ ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు.