వేములవాడ: గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ బుధవారం నాడు వేములవాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

 గజ్వేల్‌ బ్యాంకు ఉద్యోగి దివ్యను వెంకటేష్ ఈ నెల 18వ తేదీ రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు.గ దివ్యను వెంకటేష్‌ హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టుగా  సమాచారం.

Also read:గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి హత్య కేసు: వెంకటేష్, దివ్య రహస్య వివాహం

దివ్యను ప్రేమ వివాహం చేసుకొన్నట్టుగా వెంకటేష్‌ పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది.  ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు నిందితుడు వెంకటేష్‌ను గజ్వేల్‌కు తరలించే అవకాశం ఉంది.

దివ్య హత్యకు గురైన సమయం నుండి  వెంకటేష్ ఆచూకీ లభ్యం కాలేదు. నిందితుడి ఫోన్ కూడ స్విచ్చాప్ చేసి ఉంది. వెంకటేష్ తల్లిదండ్రులను పోలీసులు గజ్వేల్ కు తీసుకొచ్చారు. వెంకటేష్ కోసం ఐదు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

అయితే వెంకటేష్ వేములవాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గజ్వేల్‌లో  రాస్తారోకో నిర్వహించారు.